తీర్మానాలు లేకపోతే… ఒకరోజు తీరుబడిగా పశ్చాత్తాపపడవలసి యుంటుంది. భవిష్యత్తును అందమైనదిగా చేసేది నువ్వు చేసే తీర్మానం! తీర్మానం ప్రమాణం వలె ఉండునట్లు చూసుకుందాం!

భక్తులు చేసిన తీర్మానాలు కొన్ని… ఇవిగో…

i. రూతు తీర్మానం – రూతు 1:16

(నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంటూ
తీర్మానించుకుంది ఓ మోయాబీయురాలు. అందుకు ప్రతిఫలంగా దేవుడు ఆమెకు గొప్ప బహుమానం ఇచ్చాడు. ఏమిటది? మెస్సీయాకు ఆమె పితరురాలు అయ్యింది. ఎంత గొప్ప భాగ్యం!)

ii. సమూయేలు తీర్మానం – 1 సమూ. 12:23
(ప్రార్ధన చేయుదును- లేని యెడల అది నాకు పాపమగును అంటూ తీర్మానించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయుల చరిత్రలో తనదైన శైలిలో తన ముద్రను ఎలా వేశాడో మీరు చదివారా?)

iii. యెహోషువ తీర్మానం – యెహో, 24:15
(ఇశ్రాయేలీయులు అసలే అస్థిరులు, స్థిరబుద్ధి గలవారు కారు. మూర్ఖపు ప్రవర్తన గలవారు. అలాంటివారి మధ్యలో – మీరెవరిని సేవింపకోరు
కున్నను, నేనును నా యింటివారును యెహోవానే సేవిస్తాము అంటూ తీర్మానించాడు. నా చుట్టూ ఉన్నవాళ్లందరూ అవిధేయులూ తిరుగు
బోతులూ వాళ్ల మధ్యలో నేను పరిశుద్ధంగా జీవించలేక పోతున్నాను అంటున్నావా? యెహోషువను చూడండి)

iv. ఎస్తేరు తీర్మానం – ఎస్తేరు 4:16
(హామాను ద్వారా ఆగం అయ్యే పరిస్థితి రాగా అట్టే ఆలస్యం చేయకుండా, అత్యవసరమైన పరిస్థితుల్లో నడుం కట్టి – నేనును నా పనికత్తెలును ఉపవాసముందుము అంటూ యూదులందరినీ తన ప్రార్థనలచే రక్షించుకున్న ధీరురాలు!

v. దావీదు తీర్మానం – కీర్తన 132:5
((ఆరాధించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో దావీదు చేసిన తీర్మానం – యెహోవాకు నేనొక స్థలం చూచువరకు నా కన్నులకు నిద్ర
రానియ్యను. ఇదీ, ఆయన చేసిన రోషం గల తీర్మానం. నీవు వెళ్ళే మందిరంలో ఏముందో ఏం లేదో తెల్సుకొని దానికై ప్రయాస పడున్నావా? లేక ప్రక్కకు తప్పుకుంటున్నావా?)

బ్రతుకులను మలుపు తిప్పే భక్తుల తీర్మానాలు విన్నారా! తిని కూర్చోవడమే నీ తీర్మానమైతే, రేపు తృణీకరింపబడ్తావ్!